గొల్ల, కురుమలకు గుడ్‌న్యూస్.. నేను అదే ప్రయత్నంలో ఉన్నా : హర్యానా గవర్నర్
దిశ, జమ్మికుంట : గొల్ల, కురుమలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని ఎదగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలో గొల్ల, కురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సభలో ఆయన మాట్లాడారు. గొల్ల, కురుమలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురయ్యారని, గొల్ల, కురుమలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. అప్పుడే గుర్తింపు వస్తుందని, తాను కూడా ఉన్నత చదువులు చదవడం వల్లే కేంద్రమంత్రి, ప్రస్తుతం గవర్నర్ పదవులు దక్కాయని చెప్పుకొచ్చారు. […]
దిశ, జమ్మికుంట : గొల్ల, కురుమలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని ఎదగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలో గొల్ల, కురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార సభలో ఆయన మాట్లాడారు. గొల్ల, కురుమలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురయ్యారని, గొల్ల, కురుమలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. అప్పుడే గుర్తింపు వస్తుందని, తాను కూడా ఉన్నత చదువులు చదవడం వల్లే కేంద్రమంత్రి, ప్రస్తుతం గవర్నర్ పదవులు దక్కాయని చెప్పుకొచ్చారు. మనమంతా ఒకరిని అడిగే విధంగా ఉండకూడదని, ఒకరికి ఇచ్చేలా ఎదగాలన్నారు.
అందుకు చదువు ఒక్కటే మార్గమని సూచించారు. తమ కులస్థులు కేవలం గొర్ల కాపరి గానే ఆగిపోవద్దని, వ్యాపార వేత్తలుగా, విద్యావంతులుగా ఎదిగినపుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చారు. గొర్ల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సమయానికి కడుతున్నది మనమే అని చెప్పారు. ఆడ, మగవారు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘భేటీ బచావో, బేటి పడావో ’అనే పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. గొల్ల, కురుమల అభివృద్ధికి కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. గొల్ల, కురుమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాలా మంది కోరుతున్నారని ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
తనకు చేసిన ఈ సన్మానం కేవలం గొల్ల, కుర్మలకు కాదని రాజ్యాంగానికి చేసిన సన్మానంగా అభివర్ణించారు. కాగా మొట్టమొదటగా డోలు కొట్టి దత్తాత్రేయ సభను ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడారు. గొల్ల, కురుమల జాతి రత్నం బండారు దత్తాత్రేయ అని నీతి, నిజాయితీకి ఆయన మారుపేరని కొనియాడారు. ధర్మం, న్యాయం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తి దత్తాత్రేయ మాత్రమే అని వివరించారు. కార్యక్రమంలో గొల్ల, కురుమల సంఘం నాయకులు మహిపాల్ యాదవ్, కన్నేబోయిన రవి యాదవ్, రవీందర్ కురుమ, మల్లేష్, సురేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.