కొండగట్టులో ఉత్సవాలు ప్రారంభం

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా అర్థ మండపంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించిన అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు జరిపారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపద్యంలో వేదపండితుల సమక్షంలోనే ఉత్సవాలు ముగించాలని నిర్ణయించారు. ఈనెల 17 వరకు ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తామని ఆలయ […]

Update: 2020-05-15 05:32 GMT

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా అర్థ మండపంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించిన అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు జరిపారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపద్యంలో వేదపండితుల సమక్షంలోనే ఉత్సవాలు ముగించాలని నిర్ణయించారు. ఈనెల 17 వరకు ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. సాధారణ భక్తులు, దీక్షాపరులకు కొండపైకి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీక్షాపరులు తమ ఇళ్లలోనే తల్లిదండ్రులతో మాలవిరమణ చేసుకోవాలంటూ పండితులు సూచించారు.

Hanuman Jayanti celebrations in the Kondagattu

Tags:    

Similar News