వరల్డ్ యోగా డే స్పెషల్.. గుర్రం దయాకర్ కళాత్మకతకు సెల్యూట్

దిశ, జగిత్యాల : ప్రపంచ యోగా డేను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసి నగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా.గుర్రం దయాకర్ మరో అద్భుత కళా ఖండాన్ని ఆవిష్కరించారు. 21 జూన్ ప్రపంచ యోగా డే సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు యోగాపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో యోగా సాధన చేస్తున్న మహిళ విగ్రహాన్ని బంగారంతో అత్యంత సూక్ష్మంగా, పంపకాల సూది మోనపై రూపొందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈ విగ్రహం బరువు 0.2 […]

Update: 2021-06-20 09:19 GMT

దిశ, జగిత్యాల : ప్రపంచ యోగా డేను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసి నగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా.గుర్రం దయాకర్ మరో అద్భుత కళా ఖండాన్ని ఆవిష్కరించారు. 21 జూన్ ప్రపంచ యోగా డే సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు యోగాపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో యోగా సాధన చేస్తున్న మహిళ విగ్రహాన్ని బంగారంతో అత్యంత సూక్ష్మంగా, పంపకాల సూది మోనపై రూపొందించారు.

ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈ విగ్రహం బరువు 0.2 మిల్లీ గ్రాములు ఉందని దీని తయారీకి 8 గంటల సమయం పట్టిందని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు యోగా సాధన చేయడంతోనే తొందరగా కోలుకున్నారని గుర్తుచేశారు. భారతదేశ సంస్కృతుల్లో ఒకటైన యోగా ఓ గొప్ప వరమని, దీని గురించి సమాజానికి అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ బంగారు విగ్రహాన్ని సూది మోనపై తయారు చేశానని దయాకర్ తెలిపారు.

Tags:    

Similar News