జాబ్స్ పేరిట అమాయకులకు గల్ఫ్ ఏజెంట్ టోకరా.. తగిన శాస్తి చేసిన బాధితులు
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో ఓ గల్ఫ్ ఏజెంట్ భారీ మోసానికి పాల్పడ్డాడు. యువకులను సింగపూర్ పంపిస్తానని డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేశాడు. చివరకు అతనికి దేహశుద్ది చేశారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన సుమారు 16 మంది యువకులను ఓ గల్ఫ్ ఏజెంట్ సింగపూర్ పంపిస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు ఒక్కొక్క యువకుడి నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. అనంతరం నకిలీ వీసాలు, […]
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో ఓ గల్ఫ్ ఏజెంట్ భారీ మోసానికి పాల్పడ్డాడు. యువకులను సింగపూర్ పంపిస్తానని డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేశాడు. చివరకు అతనికి దేహశుద్ది చేశారు బాధితులు. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన సుమారు 16 మంది యువకులను ఓ గల్ఫ్ ఏజెంట్ సింగపూర్ పంపిస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు ఒక్కొక్క యువకుడి నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు.
అనంతరం నకిలీ వీసాలు, జాయినింగ్ లెటర్స్ ఇచ్చాడు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గల్ఫ్ ఏజెంట్‌ను వెంకటాపూర్ గ్రామంలో పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. తమ వద్ద నుంచి మొత్తం రూ.16 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరారు.