ఇక మన చేతుల్లో లేదు!

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, ధ్రువాల వద్ద మంచు గణనీయ స్థాయిలో కరిగిపోతోందని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఈ పరిణామాన్ని కట్టడి చేయడానికి ఎన్నో సమావేశాలు, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అయితే ఏసీ వాడొద్దని చెప్పడానికి ఏసీ గదుల్లో మీటింగ్ పెట్టుకున్నట్లుగానే.. ఆ సదస్సులు, సమావేశాల ముచ్చట్లన్నీ గంగలో కలుస్తున్నాయి. ఈ అంశానికి తగ్గట్టుగా చెప్పాలంటే మంచులో కరిగి సముద్రంలో కలుస్తున్నాయి. అవును.. ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు కొండలు కరుగుతున్న రేటును అధ్యయనం […]

Update: 2020-08-17 06:51 GMT

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, ధ్రువాల వద్ద మంచు గణనీయ స్థాయిలో కరిగిపోతోందని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఈ పరిణామాన్ని కట్టడి చేయడానికి ఎన్నో సమావేశాలు, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అయితే ఏసీ వాడొద్దని చెప్పడానికి ఏసీ గదుల్లో మీటింగ్ పెట్టుకున్నట్లుగానే.. ఆ సదస్సులు, సమావేశాల ముచ్చట్లన్నీ గంగలో కలుస్తున్నాయి. ఈ అంశానికి తగ్గట్టుగా చెప్పాలంటే మంచులో కరిగి సముద్రంలో కలుస్తున్నాయి. అవును.. ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు కొండలు కరుగుతున్న రేటును అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు విడుదల చేసిన నివేదికలో ఇలాంటి పదాలనే ఉపయోగించారు. ఇక గ్లోబల్ వార్మింగ్‌ను ఆపడం మన చేతిలో లేదు, బాగు చేయడానికి వీలు లేనంతగా గ్రీన్‌ల్యాండ్‌లో మంచు గడ్డలు కరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌షీట్‌గా గ్రీన్‌ల్యాండ్‌లో ఉంది. అది వేగంగా కరిగిపోతోందని, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించినా కూడా ఆ కరిగిపోయిన మంచు గడ్డలను పునరుద్ధరించలేమని డౌన్‌టుఎర్త్ మాగజైన్‌లో ప్రచురించిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ మంచు గడ్డలు కరగడం వల్ల గ్రీన్‌ల్యాండ్ గురుత్వాకర్షణ తలంలో కూడా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కరిగిపోవడం వల్ల అసాధారణ స్థాయిలో సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఒకవేళ అదే జరిగితే రాబోయే పరిణామాలను తట్టుకోగల శక్తి మానవజాతికి లేదని ఆ వ్యాసంలో తెలియజేశారు. కొన్ని దశాబ్దాల నాటి శాటిలైట్ డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరంలో తాజా స్నోఫాల్ నుంచి గ్రీన్‌ల్యాండ్ ఐస్‌క్యాప్ నిరంతరంగా తగ్గుతోందే తప్ప కొద్ది శాతమైనా పెరుగుదల లేదని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News