పక్షులను కాపాడండి.. వాటి అనుమతులు రద్దు చేయండి

దిశ,హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఏలబోతారం గ్రామ శివారు లోని శ్రీవారి ఎంటర్ ప్రైజెస్ ప్రతిపాదిత ఎనిమిది హెక్టార్ల గ్రానైట్ క్వారీ అనుమతులు రద్దు చేయాలని ఏలబోతారం గ్రామస్తులు మంగళవారం సైదాపూర్ తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు. అనతరం వారు మాట్లాడుతూ.. మా గ్రామ శివారులో ఉన్న గుట్ట పైన జాతీయ పక్షి నెమలి, అంతరించి పోతున్న పక్షులు.. పాలపిట్ట, గరుత్మంతుడు, వడ్రంగి పిట్టలు,జతువులు స్థావరం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి అని అన్నారు. ఈ […]

Update: 2021-04-06 04:00 GMT

దిశ,హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఏలబోతారం గ్రామ శివారు లోని శ్రీవారి ఎంటర్ ప్రైజెస్ ప్రతిపాదిత ఎనిమిది హెక్టార్ల గ్రానైట్ క్వారీ అనుమతులు రద్దు చేయాలని ఏలబోతారం గ్రామస్తులు మంగళవారం సైదాపూర్ తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు. అనతరం వారు మాట్లాడుతూ.. మా గ్రామ శివారులో ఉన్న గుట్ట పైన జాతీయ పక్షి నెమలి, అంతరించి పోతున్న పక్షులు.. పాలపిట్ట, గరుత్మంతుడు, వడ్రంగి పిట్టలు,జతువులు స్థావరం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి అని అన్నారు.

ఈ గుట్టకి గ్రానైట్ క్వారీ కీ అనుమతులు ఇస్తే పక్షులు, జంతువులు అంతరించి పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను, అంతరించి పోతున్న పక్షులు, జంతువులను కాపాడాలని గ్రానైట్ క్వారీ అనుమతులు రద్దు చేయాలని కోరారు. అనుమతులు రద్దు చేయకుంటే వారం రోజులలో ఉద్యమం ఉధృతం చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి సుధాకర్, నామిండ్ల సతీష్, నామిండ్ల రవీందర్, పున్నం శ్రీనివాస్, నామిండ్ల కుమార్, కొయ్యడ రాజేందర్, కొడపర్తి నర్సయ్య, నామిండ్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News