సిటీ బస్సులకు నో పర్మిషన్ : సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి లోకల్ (సిటీ) బస్సులు తిప్పవద్దని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్ స్టేట్ బస్సులను తిప్పాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు తదితరులు […]
దిశ, న్యూస్ బ్యూరో: రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి లోకల్ (సిటీ) బస్సులు తిప్పవద్దని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్ స్టేట్ బస్సులను తిప్పాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు తదితరులు పాల్గొన్నారు. సంస్థ ప్రస్తుత ఓఆర్ ఆర్థిక పరిస్థితిపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. సిటీ బస్సులను నడపడంపై మంత్రి పువ్వాడ అజయ్ ఇటీవల ఆర్టీసీ అధికారులతో సమీక్షించి సన్నద్ధతపై చర్చించారు. ఈ నెల 8 నుంచి మరిన్ని సడలింపులు అమలులోకి వచ్చినందువల్ల సిటీ బస్సులు నడుస్తాయనే ఊహాగానాలు వెలువడినా కరోనా పరిస్థితుల నేపథ్యంలో నడపవద్దనే నిర్ణయం తీసుకుంది. సీఎంతో జరిగిన చర్చ సందర్భంగా కూడా ఇదే విషయమై చర్చకు రావడం, గ్రేటర్ హైదరాబాద్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు తిప్పకపోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.