చంద్రబాబుతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతల సంప్రదింపులతో ఎట్టకేలకు పార్టీ అధినేతను గురువారం ఎన్టీఆర్ భవన్ లో కలిశారు. ఈ భేటీతో రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కాగా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గోరంట్ల పలు కీలక విషయాలు వెల్లడించారు. పార్టీ ఉన్నంత వరకూ చంద్రబాబుతోనే ఉంటానని […]
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతల సంప్రదింపులతో ఎట్టకేలకు పార్టీ అధినేతను గురువారం ఎన్టీఆర్ భవన్ లో కలిశారు. ఈ భేటీతో రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కాగా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గోరంట్ల పలు కీలక విషయాలు వెల్లడించారు.
పార్టీ ఉన్నంత వరకూ చంద్రబాబుతోనే ఉంటానని స్పష్టం చేశారు. వేరే కండువా కప్పుకుని ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని వెల్లడించారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలో చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపిన ఆయన.. పార్టీ కష్టకాలంలో ఉందని, కొన్ని మార్పులుచేర్పులు చేయాలనీ చంద్రబాబుకు వివరించినట్టు తెలిపారు. పార్టీ మనది అనే భావన ప్రతి కార్యకర్తలో రావాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన భాధ్యత ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్తపై ఉందని కార్యకర్తలకు సూచించారు. రాజీనామా వార్తలపై స్పందించిన ఆయన.. 40 సంవత్సరాలుగా పదవులతో సంబంధం లేకుండా పని చేశాను, వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల విన్నపాల వల్లే నా రాజీనామాను వెనక్కి తీసుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు.