గోవా వెళ్లాల‌నుకునేవారికి గుడ్ న్యూస్..

దిశ, వెబ్ డెస్క్: గోవా టూర్‌కు వెళ్లాలనుకునే వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై 2వ తేదీ నుంచి ప‌ర్యాట‌కుల‌కు అనుమతి ఇస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ వెల్ల‌డించారు. అయితే దేశీయ ప‌ర్యాట‌కులు మాత్ర‌మే అని కండిషన్ పెట్టారు. పర్యాటక కార్యకలాపాలను పునః ప్రారంభించే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 250 హోటళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చిన‌ట్టు వివ‌రించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రామాణిక […]

Update: 2020-07-01 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్: గోవా టూర్‌కు వెళ్లాలనుకునే వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై 2వ తేదీ నుంచి ప‌ర్యాట‌కుల‌కు అనుమతి ఇస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ వెల్ల‌డించారు. అయితే దేశీయ ప‌ర్యాట‌కులు మాత్ర‌మే అని కండిషన్ పెట్టారు. పర్యాటక కార్యకలాపాలను పునః ప్రారంభించే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 250 హోటళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చిన‌ట్టు వివ‌రించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలకు (ఎస్ఓపి) అనుగుణంగా హోటళ్లు నడుచుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. పర్యాటకులు పర్యాటక శాఖ ఆమోదం పొందిన హోటళ్లలో బస చేయడానికి ప్రీ-బుక్ చేసుకోవడం తప్పనిసరి అని మంత్రి చెప్పారు.

వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి విభాగంలో నమోదు చేయని హోటళ్ళు, హోమ్‌స్టేలు..అతిథులను అలరించడానికి లేదా ఆన్‌లైన్ బుకింగ్‌లను అందించడానికి అనుమతులు లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, పర్యాటకులు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లను తీసుకెళ్లవలసి ఉంటుంది. అవి లేని ప‌క్షంలో సరిహద్దు వద్ద కరోనా పరీక్షలు చేయించుకుని..రిపోర్ట్ వచ్చేవరకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని వెల్ల‌డించారు.

Tags:    

Similar News