పురుగుల మందు తాగిన బాలిక.. కళ్లెదుటే కూతురు ఇలా..!
దిశ, వీణవంక: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రామంచ పరశురాములు చిన్న కూతురు రామంచ శ్రీవాణి( 15 ) ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక […]
దిశ, వీణవంక: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రామంచ పరశురాములు చిన్న కూతురు రామంచ శ్రీవాణి( 15 ) ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. కళ్లదుటే కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, కుటుంబ కలహాలే బాలిక మృతికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.