హంతకుల కోసం జర్మన్ టెక్నాలజీ…

          కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ముత్తా రాధిక హత్య కేసు చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. రాధిక హత్య తరువాత ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోడంతో ఆమెను చంపిందెవరు అనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. ఈ నెల 10న జరిగిన ఈ మర్డర్ కేసు విషయంలో పోలీసులు సీసీ కెమెరాలను, మోబైల్ ఫోన్ల లోకేషన్‌ను ఆధారం చేసుకుని సాక్ష్యాల కోసం […]

Update: 2020-02-13 07:18 GMT

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ముత్తా రాధిక హత్య కేసు చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. రాధిక హత్య తరువాత ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోడంతో ఆమెను చంపిందెవరు అనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. ఈ నెల 10న జరిగిన ఈ మర్డర్ కేసు విషయంలో పోలీసులు సీసీ కెమెరాలను, మోబైల్ ఫోన్ల లోకేషన్‌ను ఆధారం చేసుకుని సాక్ష్యాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హంతకులు తెలివిని ప్రదర్శించి మొబైల్ ఫోన్‌ను వాడకపోవడం, సీసీ కెమెరాలను ఉన్న ప్రాంతం మీదుగా కాకుండా వేరే వీధుల మీదుగా వెల్లడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం గగనంగా మారింది. దీంతో పోలీసు అధికారులు జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలు సేకరించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్‌కు చెందిన క్లూస్ టీంను కరీంనగర్‌కు రప్పించారు. క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి నేతృత్వంలో ఐదుగురు బృందంతో ఆధారాలు సేకరించారు. మృతురాలు రాధిక ఇంటిని సందర్శించిన ఈ టీం కీలకమైన ఆధారాలు సేకరించింది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో అత్యాధునికమైన జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తెలుసుకొనే సదుపాయం ఉండడంతో పాటు 3D క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ వీడియో గ్రఫీ, 3D Scanner, BODY Fluid కిట్‌లను ఉపయోగించి ముఖ్యమైన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించారు. ఈ స్పెషల్ టీం సేకరించిన ఆధారాలను లాబోరేటరీలో విశ్లేషించి హంతకులు ఎవరన్నది తేల్చనున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News