పాపం "జార్జి".. దండం పెడతా అన్నం పెట్టండి సారూ..
దిశ, భువనగిరి రూరల్: వలిగొండ మండల కేంద్రంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టగడుపుకునే నిరుపేద కూలీ అతను. అతని పేరు “జార్జి” పని ఉంటే కడుపు నింపుకుంటాడు. పని లేకపోతే పస్తులుంటాడు. రోజుకు ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి వలిగొండ మండల కేంద్రంలో జీవనం సాగిస్తున్నాడు. అతనికి నా అంటూ ఎవరూ లేకుండా పోయారు. 30 సంవత్సరాల నుంచి వలిగొండలో నివసిస్తున్న అతనికి ఇల్లు కూడా లేదు. రోడ్లపైనే అతని […]
దిశ, భువనగిరి రూరల్: వలిగొండ మండల కేంద్రంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టగడుపుకునే నిరుపేద కూలీ అతను. అతని పేరు “జార్జి” పని ఉంటే కడుపు నింపుకుంటాడు. పని లేకపోతే పస్తులుంటాడు. రోజుకు ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి వలిగొండ మండల కేంద్రంలో జీవనం సాగిస్తున్నాడు. అతనికి నా అంటూ ఎవరూ లేకుండా పోయారు. 30 సంవత్సరాల నుంచి వలిగొండలో నివసిస్తున్న అతనికి ఇల్లు కూడా లేదు. రోడ్లపైనే అతని జీవితం. కానీ అనుకోకుండా జూన్ 27 ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కాలు విరిగింది. కనీసం హాస్పిటల్లో చికిత్స చేపించే నాథుడే లేడు. ప్రస్తుతం కూడా రోడ్లపై దీనావస్థలో పడి ఉన్నాడు. కనీసం 18 రోజుల నుంచి అన్నం లేదని బోరున విలపించాడు. ఎవరైనా నాకు వైద్యం చేపించండి.. కొంచం అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నాడు.