ఈటల ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తారంటా.. గెల్లు శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు ఈటల అహంకారానికి, ప్రభుత్వ సంక్షేమానికి మధ్య జరుగుతున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల స్వార్థంతో వచ్చిన ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 200 ఎకరాల్లో ఎకరం భూమి అమ్మి అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాల్సిందేనని తన భార్య చెప్పారని ఈటల ప్రకటించిన విషయాన్ని హుజురాబాద్ బిడ్డలు మర్చిపోవద్దన్నారు. ప్రజలకు అన్ని […]
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు ఈటల అహంకారానికి, ప్రభుత్వ సంక్షేమానికి మధ్య జరుగుతున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈటల స్వార్థంతో వచ్చిన ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 200 ఎకరాల్లో ఎకరం భూమి అమ్మి అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాల్సిందేనని తన భార్య చెప్పారని ఈటల ప్రకటించిన విషయాన్ని హుజురాబాద్ బిడ్డలు మర్చిపోవద్దన్నారు.
ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని గెల్లు శ్రీనివాస్ అన్నారు. పేదోనివని దిగులు పడవద్దని ప్రజలే తనకు ధైర్యం చెప్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నింటా అభివృద్ది చేస్తానని గెల్లు తెలిపారు.