వామన్ రావు మర్డర్ కేసు.. ముగ్గురు నిందితులకు బెయిల్ తిరస్కరణ

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హై కోర్టు అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో ముగ్గురి నిందితుల బెయల్ పిటిషన్‌ను మంథని ప్రిన్సిపల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు. హత్య ఘటన జరిగి 90 రోజులు పూర్తయిందని, సీఆర్పీసీ సెక్షన్ 167 కింద తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నిందితుల బెయిల్ పిటిషన్‌ను మంథని మెజిస్ట్రేట్ తిరస్కరించారని తెలిసింది. ఏ1 […]

Update: 2021-05-20 06:47 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హై కోర్టు అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో ముగ్గురి నిందితుల బెయల్ పిటిషన్‌ను మంథని ప్రిన్సిపల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు. హత్య ఘటన జరిగి 90 రోజులు పూర్తయిందని, సీఆర్పీసీ సెక్షన్ 167 కింద తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నిందితుల బెయిల్ పిటిషన్‌ను మంథని మెజిస్ట్రేట్ తిరస్కరించారని తెలిసింది. ఏ1 కుంట శ్రీనివాస్, ఏ2 చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్‌లు తమకు బెయిల్ మంజూరు చేయాలని మంథని కోర్టును అభ్యర్థించారు.

ఛార్జిషీట్ దాఖలు..

వామన్ రావు దంపతుల హత్య కేసులో రామగుండం పోలీసులు కొద్ది సేపటి కిందట మంథని కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అధికారి, డీసీపీ అశోక్ కుమార్ మంథని ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ హార్డ్ కాపీని కోర్టులో సమర్పించారు.

Tags:    

Similar News