మంత్రి గంగుల మార్నింగ్ వాక్.. మధ్యలో ఏం చేశారంటే ( వీడియో)
దిశ,హుజురాబాద్: పలు గ్రామాలలో మంత్రి గంగుల మార్నింగ్ వాక్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆ పార్టీకి ఓట్లు వేయవద్దన్నారు. బుధవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్, బోర్ణ పల్లి గ్రామాలలో మార్నింగ్ వాక్ చేస్తూ మధ్యలో ఆయా గ్రామాల సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల మహిళలు చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం, పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి ఇతర సమస్యలను […]
దిశ,హుజురాబాద్: పలు గ్రామాలలో మంత్రి గంగుల మార్నింగ్ వాక్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆ పార్టీకి ఓట్లు వేయవద్దన్నారు. బుధవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్, బోర్ణ పల్లి గ్రామాలలో మార్నింగ్ వాక్ చేస్తూ మధ్యలో ఆయా గ్రామాల సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ గ్రామాల మహిళలు చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం, పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి ఇతర సమస్యలను మంత్రి గంగుల కమలాకర్‌కి విన్నవించుకున్నారు. జిల్లా మంత్రిగా నేను ఉన్నా మీ సమస్యలు పరిష్కారం చేస్తాననిమంత్రి గంగుల హామీ ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆ పార్టీకి ఓట్లు వేయవద్దని మంత్రి గంగుల మహిళలకు వివరించారు.