కుండపోత.. రోడ్లన్నీ జలమయం
దిశ రాజేంద్రనగర్ : హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లాక్‌డౌన్ సడలింపు సమయం కావడంతో బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, మైలార్దేవుపల్లి ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉన్నట్టుండి ఉప్పర్ పల్లి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కిందకు వర్షపు నీరు చేరడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో […]
దిశ రాజేంద్రనగర్ : హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లాక్‌డౌన్ సడలింపు సమయం కావడంతో బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, మైలార్దేవుపల్లి ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
ఉన్నట్టుండి ఉప్పర్ పల్లి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కిందకు వర్షపు నీరు చేరడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా శంషాబాద్ బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరింది.