CPI: పదేళ్లు ప్రజల గొంతు నొక్కి ఇప్పుడు కూడా మాట్లాడనివ్వరా.. ఎమ్మెల్యే కూనంనేని
అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నేతలు(BRS Laeders) తెలంగాణ ప్రజల(Telangana People) గొంతు నొక్కేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నేతలు(BRS Laeders) తెలంగాణ ప్రజల(Telangana People) గొంతు నొక్కేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు. అసెంబ్లీ(Telangana Assembly Sessions)లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల తీరుపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడనివ్వడం లేదని చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించే దేవాలయం ఈ అసెంబ్లీ అని, మా గొంతులు నొక్కే అధికారం వారికి ఎవరు ఇచ్చారని మండిపడ్డారు. స్పీకర్(Speaker) స్థానంలో ఉన్న మీరు ధర్మరాజు లాంటి వారని, మీకు కూడా ఆగ్రహం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ధరణి(Dharani) పేరుతో భూమాతను, తెలంగాణ రైతాంగాన్ని బంధించారని, ఆ బంధించబడిన భూమాతకు సంకెళ్లు తెంపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే.. అది ఈ సభలో చర్చించడానికి, సూచనలు ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సహనానికి హద్దులు చెరిపేసి సభలో గంధరగోళం సృష్టించిన సభ్యులను సస్పెండ్(Suspend) చేయాలని స్పీకర్ ను కోరారు.