CM Revanth Reddy : కోర్టులో కేసు ఉంది..అసెంబ్లీలో మాట్లడటం సరికాదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫార్ములా ఈ రేసు కేసు(Formula E race case)పై చర్చించేందుకు కోర్టు అనుమతిస్తే శాసన సభలోనే కాదు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు మేం సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు

Update: 2024-12-20 10:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E race case)పై చర్చించేందుకు కోర్టు అనుమతిస్తే శాసన సభలోనే కాదు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు మేం సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి చర్చలో మాట్లాడుతూ ఫార్ములా రేసు కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రై పార్టీ అగ్రిమెంట్, బై పార్టీ అగ్రిమెంట్ గా మారడం, ఎన్నికల కోడ్ లో అన్ని నిబంధనలు, అనుమతులు పాటించకుండానే హెచ్ఎండీఏ అకౌంట్ల ఉండాల్సిన డబ్బు 55కోట్లు విదేశీ కంపనీలకు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడంపై రేసుపై కేసు కొనసాగుతోందన్నారు. వాస్తవంగా ఇది 600కోట్ల బదలాయింపు వ్యవహారమని, ఫార్ములా-ఈ కంపెనీ కో-ఫౌండర్, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో నన్ను కలిసి మొత్తం డబ్బుల వ్యవహారం చెప్పి సహకరించాలని కోరినప్పుడే ఈ స్కామ్ నాకు తెలిసిందన్నారు.

ఆయనతో ఫోటో దిగడంలో దాపరికం లేదని, సీఎంగా నన్ను ఎవరు కలిసినా ఫోటో దిగుతునే ఉంటానన్నారు. రూపాయిని ఫౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు బదలాయించి, దానిపై ఆర్బీఐ ఫైన్ వేస్తే దానికి 8కోట్లు కేటీఆర్ చెల్లించాడన్నారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ధరణిపై చర్చ జరుగుతుంటూ భూభారతి చట్టాన్ని అడ్డుకునేందుకు రేసు కేసుపై చర్చకు పట్టుబడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. కొకైన్ తో దొరికితే, విదేశీ మద్యం, డ్రగ్స్ తో పట్టుబడితే మేం దావత్ చేసుకోవద్దా అని కేటీఆర్ దబాయింపు చేస్తాడని విమర్శించారు. అవుటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహరం నిబంధనలకు విరుద్ధంగా రద్ధు చేయలేమని, వీలైతే పరిశీలిస్తామని, సిట్ విచారణ చేపడుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News