Akbaruddin Owaisi: బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ నేర్పింది ఇదేనా? అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (MIM Akbaruddin Owaisi) మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో (TG Assembly) బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (MIM Akbaruddin Owaisi) మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల (BRS MLAs) తీరు అభ్యంతరకరం అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కంటే వాళ్ళ కుటుంబమే ముఖ్యమన్నారు. అసెంబ్లీకి వచ్చేది ప్రజల కోసం.. కుటుంబం కోసం కాదన్నారు. ఇవాళ సభలో జరిగింది బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ (KCR) నేర్పింది ఇదేనా? అంటూ మండిపడ్డారు.
ధరణి పోర్టల్ ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని, భూముల ఆడిటింగ్ జరగాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు గుర్తుకు చేశారు. తన డిమాండ్‌ను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన భూముల ఆడిటింగ్ చేయాలని అక్భరుద్దీన్ కోరారు. కాగా, అక్బరుద్దీన్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తూ.. సభలో నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ఫార్ములా-ఈ కేసుపై అసెంబ్లీ చర్చ పెట్టాలని హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో తీవ్ర గందరగోళం చెలరేగింది.