హైదరాబాద్‌లో యూరోపియన్ వర్సిటీల ప్రతినిధి బృందం పర్యటన

హైదరాబాద్‌లో యూరోపియన్ ఆఫ్​క్యాంపస్ ఏర్పాటుకు సుముఖంగా యూరోపియన్ వర్సిటీలు ఉన్నాయని ఆ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.

Update: 2024-12-20 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో యూరోపియన్ ఆఫ్​క్యాంపస్ ఏర్పాటుకు సుముఖంగా యూరోపియన్ వర్సిటీలు ఉన్నాయని ఆ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. శుక్రవారం యూరోపియన్ వర్సిటీల ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. అందులో భాగంగా ఇండో-యూరో సింక్రనైజేషన్, జర్మనీకి చెందిన ఐయూఎన్ గ్రూప్ ప్రతినిధులు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిశారు. జర్మనీలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కొరతను పరిష్కరించడానికి హైదరాబాద్‌లో యూరోపియన్‌కు సంబంధించిన ఆఫ్ క్యాంపస్‌ను చేయాలనుకుంటున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు ఆ ప్రతినిధి బృందం వివరించింది. ఇదిలా ఉండగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకుఉన్న సంప్రదాయ క్యాంపస్, టెక్నాలజికల్ క్యాంపస్ మోడల్‌కు పరిమితం కాకుండా నూతన ఇన్నోవేషన్‌ను తీసుకురావాలని కోరారు.

నల్సార్ విశ్వవిద్యాలయంలో సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా తన అనుభవాన్ని వారికి వివరించారు. తెలంగాణకు చెందిన యూనివర్సిటీలు క్వాలిటీ చదువును విద్యార్థుల చెంతకే చేర్చేలా సరళతరం చేస్తోందని డెలిగేషన్‌కు వివరించారు. ఇదిలా ఉండగా జర్మనీ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం తాము ప్రతిపాదించిన వర్సిటీలో 12 మిలియన్ యూరోల పెట్టుబడితో 1000 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తామని ఉన్నత విద్యామండలికి వివరించారు. ఇందులో ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులను ఫైనల్ ఇయర్ ప్రోగ్రామ్ కోసం జర్మనీకి పంపస్తామని వివరించారు.

ఆ విద్యార్థులకు 10 నుంచి 50 మిలియన్ యూరోలు ఖర్చు కోసం అందిస్తామని వివరించారు. జర్మన్‌లో భారతదేశ అభ్యర్థులు ఇంజినీరింగ్, హెల్త్ కేర్ సెక్టార్‌లో డ్యూయల్ మోడల్‌తో ఉపాధి పొందేలా చుస్తామని వారు స్పష్టంచేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసిన యూరోపియన్ ప్రతినిధి బృందంలో ఐయూఎన్న గ్రూప్ సీఈవో, ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టియన్ వెర్నర్, జర్మన్ వర్సిటీ డైరెక్టర్ అలెగ్జాండర్, జర్మన్ వర్సిటీ, ఇండో యూరోపియన్ సింక్రనైజేషన్ ఎండీ రాజ్ వంగపండు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News