స్నేహితుడికి పూర్వ విద్యార్థుల చేయూత
దిశ, నల్గొండ : స్నేహితులు అంటే రోజు మొత్తం ఊరంతా తిరిగి, ఆ తర్వాత మర్చిపోయేవారు కాదు. స్నేహితుడి బాధలలో తోడు ఉండి, కష్టకాలంలో చేయి అందించేవారు. తాజాగా చూపు కోల్పోయిన స్నేహితుడుకు ఆర్థిక సాయం అందించి నిజమైన స్నేహానికి అర్ధం చెప్పారు అతని చిన్ననాటి స్నేహితులు. చివ్వెంల మండలం పాండ్యానాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ధారావత్ హేమానాయక్ పలు అనారోగ్య సమస్యల కారణంగా తన రెండు కళ్ళ చూపును కోల్పోయాడు. పలుమార్లు కంటి ఆపరేషన్ చేయించినా ఫలితం […]
దిశ, నల్గొండ : స్నేహితులు అంటే రోజు మొత్తం ఊరంతా తిరిగి, ఆ తర్వాత మర్చిపోయేవారు కాదు. స్నేహితుడి బాధలలో తోడు ఉండి, కష్టకాలంలో చేయి అందించేవారు. తాజాగా చూపు కోల్పోయిన స్నేహితుడుకు ఆర్థిక సాయం అందించి నిజమైన స్నేహానికి అర్ధం చెప్పారు అతని చిన్ననాటి స్నేహితులు. చివ్వెంల మండలం పాండ్యానాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ధారావత్ హేమానాయక్ పలు అనారోగ్య సమస్యల కారణంగా తన రెండు కళ్ళ చూపును కోల్పోయాడు. పలుమార్లు కంటి ఆపరేషన్ చేయించినా ఫలితం దక్కకపోవడంతో తన చీకటి జీవితాన్ని తన సోదరి పర్యవేక్షణలో గడుపుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తన చిన్ననాటి స్నేహితులు నెమ్మికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి -1999 పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ బయ్యా శివరాజ్ మార్గదర్శనంలో ఈరోజు నెమ్మికల్ లోని దండుమైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో హేమానాయక్ కు తక్షణ సహాయంగా పదివేల రూపాయలను అందిచ్చారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వైస్ ఛైర్మన్ అబ్బోజు సతీష్ కుమార్ మాట్లాడుతూ మనతోపాటు కలిసి ఆడి పాడి చదువుకున్న స్నేహితుడు హేమానాయక్ పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని స్నేహితులందరి సహాయంతో అతన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం చాలా హర్షించదగిన విషయమన్నారు. అదేవిధంగా హేమానాయక్ కంటి చూపు వచ్చే విధంగా పలువురు డాక్టర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తామనీ, అతనికి భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు వచ్చినా ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధారావత్ రవీందర్ నాయక్, లావుడ్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.