కేసీఆర్ పాలనలో మూతబడిన 4 వేల బడులు..

దిశ, వీణవంక : హుజురాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయశాంతి ఆదివారం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకునే 4వేల బడులు మూతపడ్డాయని అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా నాన్చుతున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని, భూ నిర్వాసితుల ఉసురు పోసుకున్నారని, ఏడేళ్లుగా నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని.. ఒక్క పథకం కూడా సక్రమంగా […]

Update: 2021-10-24 09:26 GMT

దిశ, వీణవంక : హుజురాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయశాంతి ఆదివారం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకునే 4వేల బడులు మూతపడ్డాయని అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా నాన్చుతున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని, భూ నిర్వాసితుల ఉసురు పోసుకున్నారని, ఏడేళ్లుగా నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని.. ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని.. ఆ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని ప్రశ్నించారు.

దొరగారు వస్తే రోడ్డు పక్కన మా అక్క చెల్లెలు దండం పెడుతూ నిలబడాలా.. ఇదేనా టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ఆడవారికి ఇచ్చే గౌరవం అని అన్నారు. బతుకమ్మ చీరలు కట్టుకునేలా ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. మీ జేబులు నిండాయి తప్ప ప్రజలు బాగు పడలేదని, ప్రజలారా.. మీరు కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. అవినీతి సీఎంను ఉంచాలా.. దించాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారికి దమాక్ లేదని, కేసీఆర్ ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి చేర్చారని ఆ నాయకులు చెప్పడం వాస్తవం కాదన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు మా ఎమ్మెల్యేలు అమ్మబడును అనే బోర్డు పెట్టుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలిసిపోయిందని అందుకే హుజురాబాదులో మీటింగ్ పెట్టడం లేదన్నారు.

Tags:    

Similar News