కిడ్నాప్ కేసుపై భూమా అఖిలప్రియ రియాక్షన్ ఇదే
దిశ,వెబ్‌డెస్క్ : హఫీజ్ పేటలోని రూ.100 కోట్ల విలువైన ల్యాండ్ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ సమీప బంధువులు మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఆ ముగ్గురిని అక్కడ నుంచి బలవంతంగా కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ […]
దిశ,వెబ్‌డెస్క్ : హఫీజ్ పేటలోని రూ.100 కోట్ల విలువైన ల్యాండ్ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు.
మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ సమీప బంధువులు మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఆ ముగ్గురిని అక్కడ నుంచి బలవంతంగా కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీలు సీసీటీవీ పుటేజీల సాయంతో నిందితుల్ని అందుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిల, ఆమె భర్త భార్గవ రెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేశారు.భార్గవ రెడ్డి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అయితే ఈ కిడ్నాప్ కేసుపై అఖిలప్రియ స్పందించారు.
నేను అమాయకురాల్ని నాకేపాపం తెలియదు. నా పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. అంతేకాదు నా భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదు. ఈ కిడ్నాప్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. నాకు కొంత సమయం ఇస్తే అన్నీ విషయాలు మీడియాకు వెల్లడిస్తా.ఒక వైపు వాదనలు విని మాపై తప్పుడు వార్తలు ప్రసారం చేయోద్దంటూ భూమా అఖిల ప్రియ మీడియాకు విజ్ఞప్తి చేశారు.