కరీంనగర్లో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పర్యటన..
దిశ, కరీంనగర్ సిటీ : కేంద్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం నగరంలో పర్యటించారు. పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆరెస్సెస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. అప్పటి నాయకుల్లో కొందరు మరణించగా, మరికొందరు వయోభారంతో ఉన్నారన్నారు. ఆయా […]
దిశ, కరీంనగర్ సిటీ : కేంద్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం నగరంలో పర్యటించారు. పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆరెస్సెస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. అప్పటి నాయకుల్లో కొందరు మరణించగా, మరికొందరు వయోభారంతో ఉన్నారన్నారు. ఆయా కుటుంబసభ్యుల పరివారాన్ని కలిసిపోదామని వచ్చానని విద్యాసాగర్ రావు చెప్పారు. మరణించిన మంగళంపల్లి సుధాకర్ శర్మ, నారాయణదాస్ ముందడా ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్న ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీభాష్యం విజయసారధి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విజయసారధి నవంబర్లో ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు తీసుకోబోతున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు డాక్టర్ గట్టు మురళిమనోహర్ను, కుటుంబసభ్యులను వారి ఇంట్లో కలిశారు. మురళిమనోహర్ గారు మంథని నుంచి పోటీ చేసే క్రమంలో ఆనాడు రూ.5 వేలు ఇచ్చి ధైర్యం నూరి పోసారని విద్యాసాగర్ రావు గుర్తుచేసుకున్నారు. నారాయణ్ దాస్ ముందడనైతే వాజపేయి, అద్వానీ లాంటి పెద్దలకు ఆతిథ్యం ఇచ్చి ఆర్ధిక సాయం అందించడమే కాకుండా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. బాజీరావు నాటి కాలంలో బీజేపీ కార్యకర్తలు ఆదర్శ వివాహాలు జరిపిస్తున్న క్రమంలో ధైర్యంగా కులాంతర, మతంతార వివాహాలను ప్రోత్సహించేవారన్నారు.
డాక్టర్ దారం నాగభూషణం కూడా చాలా ధైర్యవంతుడని, గొప్ప డాక్టరని కొనియాడారు. నాటి వ్యక్తులను స్మరించుకుంటూనే వారి కుటుంబ సభ్యుల్లో ప్రస్తుతం ఉన్న వారితో ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని దీనికి రాష్ట్ర వీహెచ్పీ బుస్సా శ్రీనివాస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని విద్యాసాగర్ రావు అన్నారు. విద్యాసాగర్ రావు వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు భేతి మహేందర్ రెడ్డి, బుస్సా శ్రీనివాస్, దారం వినోద్, అరవింద్ వ్యాస్, లడ్డు ముండడా, కోల అన్నా రెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, జలపతి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, సర్పంచ్ ముత్యాల రమణ రెడ్డి, ఉప్పు రామకృష్ణ, ఒంటెల కరుణాకర్ రెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షుడు ఎడవెళ్లి శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు వారితో ఉన్నారు.