హుజురాబాద్‌లో మరో V చిత్రం : మామ కమలం.. అల్లుడు కారు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కమల వికాసం కోసం మామ ప్రచారం చేస్తుంటే.. కారు దూకుడు పెంచేందుకు అల్లుడు ఓట్లడుగుతున్నారు. హుజురాబాద్ బై పోల్స్‌లో జరుగుతున్న ఈ Vచిత్రంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. బీజేపీ సీనియర్ నేత సీ.హెచ్ విద్యాసాగర్ రావుకు టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ మేనల్లుడు కావడం విశేషం. సర్కారు వైఫల్యాలపై మామ.. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ తరఫున మంగళవారం ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో […]

Update: 2021-10-26 11:26 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కమల వికాసం కోసం మామ ప్రచారం చేస్తుంటే.. కారు దూకుడు పెంచేందుకు అల్లుడు ఓట్లడుగుతున్నారు. హుజురాబాద్ బై పోల్స్‌లో జరుగుతున్న ఈ Vచిత్రంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. బీజేపీ సీనియర్ నేత సీ.హెచ్ విద్యాసాగర్ రావుకు టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ మేనల్లుడు కావడం విశేషం.

సర్కారు వైఫల్యాలపై మామ..

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ తరఫున మంగళవారం ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన సాగర్ జీ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దాలంటే ఈటల రాజేందర్ గెలుపు అవసరమని, రానున్న జనరల్ ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపు దిక్సూచిలా ఉపయోగపడుతుందని విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్నింటా అభివృద్ది సాధ్యమవుందని తెలిపారు.

కేసీఆర్ పథకాలు ఆదర్శం : అల్లుడు

మరోవైపున రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో తిరుగుతున్న వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించడం లేదని మండిపడుతున్నారు. నేషనల్ హైవేల నిర్మాణం వంటి విషయాల్లో వివక్ష చూపుతోందని ఆరోపించారు.

మామ విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. మేనల్లుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మామా అల్లుల్ల పోటాపోటీ ప్రచారాల్లో చివరకు హుజురాబాద్ ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారోనన్న చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో మామపై అల్లుడు గెలుస్తాడా.. లేక అల్లుని పై మామ పై చేయి సాధిస్తారా అన్న విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటునర్నారు.

Tags:    

Similar News