హుజురాబాద్ ఉపఎన్నిక: ఆ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు
దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో.. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ను కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన ఇదివరకే పూర్తిచేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం 732 బ్యాలెట్ యూనిట్లు, 703 కంట్రోల్ యూనిట్లు, 491 వీవీ ప్యాట్ల నుంచి ర్యాండమైజేషన్ […]
దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో.. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ను కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాష్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన ఇదివరకే పూర్తిచేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం 732 బ్యాలెట్ యూనిట్లు, 703 కంట్రోల్ యూనిట్లు, 491 వీవీ ప్యాట్ల నుంచి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన 427 బ్యాలెట్ యూనిట్లు, 427 కంట్రోల్ యూనిట్లు, 458 వీవీ ప్యాట్లను హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. పసుపు పచ్చ రంగు స్టిక్కర్ వేసిన ఈవీఎంలను ఎన్నికల శిక్షణకు ఉపయోగిస్తామని, ఆకుపచ్చ రంగు స్టిక్కర్లు వేసిన ఈవీఎంలను ఎన్నికలలో వినియోగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 100 వీవీ ప్యాట్లను రిజర్వులో ఉంచుతామన్నారు.
స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ..
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును రోజువారీగా చూపెట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా పోటీలో ఉన్న అభ్యర్థులు.. పంపిణీ చేసే డబ్బు, మద్యం, బహుమతులపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాంప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.సునీల్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మడుపు మోహన్, కల్యాడపు ఆగయ్య, మహమ్మద్ అఖిల్ ఫిరోజ్, గాలి అనిల్ కుమార్, జి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.