కేసీఆర్‌కు వార్నింగ్.. ఎన్నికల్లో తాడో పేడో అంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశ వేదికను మార్చినట్టు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు. ఈ నెల 23న హన్మకొండలో జరగాల్సిన రాష్ట్రస్థాయి మీటింగ్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అదే తేదీన నిర్వహించనున్నట్టు వివరించారు. 24న కృష్ణయ్య చేపట్టనున్న‘దీక్ష’లో పాల్గొనాల్సి ఉన్నందున మార్పులు చేయాల్సి వచ్చిందని శ్యామలయ్య తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల బాధ్యులు 23నే హైదరాబాద్‌కు […]

Update: 2021-08-20 08:03 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశ వేదికను మార్చినట్టు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు. ఈ నెల 23న హన్మకొండలో జరగాల్సిన రాష్ట్రస్థాయి మీటింగ్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అదే తేదీన నిర్వహించనున్నట్టు వివరించారు.

24న కృష్ణయ్య చేపట్టనున్న‘దీక్ష’లో పాల్గొనాల్సి ఉన్నందున మార్పులు చేయాల్సి వచ్చిందని శ్యామలయ్య తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల బాధ్యులు 23నే హైదరాబాద్‌కు రావాలని ఆయన కోరారు. మరునాడు ఆర్. కృష్ణయ్య చేపట్టనున్న దీక్షలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి చేర్చాలన్న డిమాండే ప్రధానమైనదని శ్యామలయ్య వివరించారు.

దీంతో రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్. కృష్ణయ్య దీక్షకు విధిగా హాజరు కావల్సి ఉందన్నారు. అంతేకాకుండా ఈ దీక్షలో తనతో పాటు ఆయా జిల్లాల బాధ్యులు కూడా పాల్గొంటున్నట్టు శ్యామలయ్య తెలిపారు. మరోవైపున హుజురాబాద్ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల మద్దతుతో పాదయాత్ర నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల్లోనే తమ భవిష్యత్తుపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

Tags:    

Similar News