తమిళనాడుకు ఇందూరు మక్కలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: విత్తనోత్పత్తిలో సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరు గాంచడానికి కారణమైన నిజామాబాద్జిల్లా మరో అరుదైన రికార్డుకు చేరువైంది. ఉత్తర తెలంగాణలో పండిన పసుపును ఎండాకాలంలో జిల్లా నుంచి బంగ్లాదేశ్ కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ లో పండిన మక్కలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నా యి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ర్ట ప్ర భుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో మార్కెట్‌కు వచ్చిన, గో దాముల్లో నిల్వ చేసిన మొక్కజొన్నలను స్థానిక […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: విత్తనోత్పత్తిలో సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరు గాంచడానికి కారణమైన నిజామాబాద్జిల్లా మరో అరుదైన రికార్డుకు చేరువైంది. ఉత్తర తెలంగాణలో పండిన పసుపును ఎండాకాలంలో జిల్లా నుంచి బంగ్లాదేశ్ కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ లో పండిన మక్కలు తమిళనాడుకు ఎగుమతి అవుతున్నా యి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ర్ట ప్ర భుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో మార్కెట్‌కు వచ్చిన, గో దాముల్లో నిల్వ చేసిన మొక్కజొన్నలను స్థానిక వ్యాపారులు వ్యాగన్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు.
నిన్న పసుపు… నేడు మక్కలు..
ఉమ్మడి రాష్ర్టంలోనే అన్నపూర్ణగా పేరొందిన నిజామాబాద్ జిల్లాలో సాగైన పంటలు, వాటి ఉత్పత్తులు పొరుగు రాష్ట్రా లతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశంలో 72 శాతం అత్యధికంగా పసుపు పంటను ఉత్తర తెలంగాణ కేంద్రంగా జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్, రూరల్ నియోజకవర్గంతో పాటు, పొరుగున ఉన్న జగిత్యా ల జిల్లాలో పండిస్తున్నారు. పచ్చ బంగారంగా ప్రసిద్ధి పొందిన పసుపుకు గత ఏడాది సరైన ధర లేకపోవడంతో గిట్టుబాటు కోసం రైతులు డిమాండ్ చేశారు. మారిన మా ర్కెటింగ్ విధానంతో పాటు ఈ నామ్ ద్వారా ఆన్ లైన్ కొ నుగోళ్లతో ఇక్కడి వ్యాపారులు పసుపు పంటను రైతుల వద్ద కొనుగోలు చేసి బంగ్లాదేశ్ కు తరలించారు. జిల్లాలో పండించిన మక్కలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున జిల్లాకు వచ్చి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుంచి రైళ్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారు.
అధిక ధరకు కొనుగోళ్లు
తెలంగాణలో ఉన్న పౌల్ట్రీ వ్యాపారులు ఛత్తీస్‌ఘడ్, హర్యా నా, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మక్కలను క్వింటాలుకు రూ.900 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేయకపోవడంతో ప్రతి సంవత్సరం నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోందని స్థానిక గంజ్ వ్యాపారు లు వాపోతున్నారు. దీంతో పాటు ఇది వరకు కొనుగోలు చేసిన మక్కలు స్టోరేజీల్లోనే నిల్వ ఉన్నాయి. జిల్లాలో పం డించిన మక్కలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండ డంతో అక్కడి వ్యాపారులు నిజామాబాద్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైల్ వ్యాగన్ల ద్వారా తరలిస్తున్నారు. మార్కె ట్ లో రూ.1500కు ధర మించడం లేదని, తమిళనాడు నుంచి వ్యాపారులు రావడంతో ధర కొంత మేరకు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మక్కలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల కోసం ఆందోళన
తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత పంటల సాగులో భాగం గా వానాకాలంలో మక్కలను సాగు చేయొద్దని అన్నదాతలకు సూచించింది. దీంతో తక్కువ సంఖ్యలో మొక్కజొన్నను వేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాల్లో మహిళా సంఘాలు, పీఏసీఎస్‌ల ద్వారా మార్క్ ఫెడ్ కొనుగోలు చే సేది. కేంద్ర ప్రభు త్వం మద్దతు ధర రూ. 1850 ప్రకటించినా ఈసారి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటాలుకు రూ. 1100 నుంచి రూ. 1300 లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.