నిఘా నేత్రం నీడలో కూరగాయల సాగు

దిశ , పెద్దపల్లి: కేవలం పట్టణంలోనే కాదు పల్లెల్లోనూ సీసీ కెమెరా అవసరం అంటున్నాడు ఓ రైతు. పట్టణాల్లో ,వీధుల్లో దొంగతనాలు నివారించడానికి సీసీ కెమెరాలు ఉపయోగిస్తారు. కానీ ఓ రైతు తన పంట పొలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. […]

Update: 2021-07-27 23:42 GMT

దిశ , పెద్దపల్లి: కేవలం పట్టణంలోనే కాదు పల్లెల్లోనూ సీసీ కెమెరా అవసరం అంటున్నాడు ఓ రైతు. పట్టణాల్లో ,వీధుల్లో దొంగతనాలు నివారించడానికి సీసీ కెమెరాలు ఉపయోగిస్తారు. కానీ ఓ రైతు తన పంట పొలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా తన పొలంలో కూరగాయలు చోరీకి గురవుతున్నాయని తెలుసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో దొంగలను కూడా పట్టుకున్నాడు. కానీ వారు క్షమించమని వేడుకోవడం తో వదిలేశాడట, ప్రతిరోజూ కనీసం 10 నుండి 20 కిలోల కూరగాయలు చోరీకి గురికావడంతో తన కుమారుని సలహా మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. మొత్తం 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని తన మొబైల్ కి అటాచ్ చేసాడు. ప్రతిరోజు సాయంత్రం రాత్రి తన మొబైల్లో వ్యవసాయ క్షేత్రం వద్ద ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దీంతో కొంత వరకు దొంగలకు అడ్డుకట్ట వేయాలిగాడు..

ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయంలో రెండెకరాలు కూరగాయలు పండిస్తున్నా అని రెండు ఎకరాలు వరి సాగు చేస్తున్నట్లు తెలిపాడు. రెండెకరాల కూరగాయల్లో మొదటిసారి కాకరకాయ సొరకాయ పండించడం జరిగిందని, ప్రస్తుతం బీరకాయ, టమాట సాగు చేస్తున్నారని తెలిపారు. కూరగాయలు చోరీకి గురవుతున్నాయని తెలియడంతో మా కుమారుడి సలహాతో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. దొంగల బెడద తగ్గిందని అన్నారు. అందరూ వరి సాగు చేస్తున్నారని, కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని అంటున్నారు. తాము కూలీలను వాడమని, భార్యాభర్తలు, అప్పుడప్పుడు కుమారులు సహాయపడతారని, ప్రతిరోజు రెండు నుండి మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కూరగాయలను పెద్దపల్లి గోదావరిఖని మార్కెట్లలో అమ్ముతున్నట్లు తెలిపాడు. సుమారు మూడు లక్షల రూపాయలతో పందిరి వేసినట్లు చేస్తున్నట్లు తెలిపాడు. 70 వేల రూపాయల సబ్సిడీ వస్తుందని, తమను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో చాలామంది కూరగాయల సాగు వైపు వస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News