అదిరింది.. వ్యవసాయంలో పల్సర్ బైక్
దిశ, ముధోల్: మారుతున్న కాలానికి వ్యవసాయ రంగంలో అవసరమయ్యే పరికరాలను తక్కువ ఖర్చుతో సమకూర్చుకొని నూతన ప్రయోగాలతో యువ రైతన్న ముందుకు సాగుతున్న తీరు అదిరింది. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన పెండేప్ కృష్ణ మూర్తి తక్కువ కూలీలతో తనకున్న ఐదెకరాల్లో సరికొత్త ప్రయోగాలతో దుక్కిలు దున్నే యంత్రం, పంటకు మందు చల్లే యంత్రం అలాగే సీడ్ డ్రమ్ యంత్రం తయారు చేసి చుట్టు పక్కల జనాలతో ఔరా అని అనిపించుకుంటున్నాడు. ఆరోగ్య ఇబ్బందులు లేకుండా […]
దిశ, ముధోల్: మారుతున్న కాలానికి వ్యవసాయ రంగంలో అవసరమయ్యే పరికరాలను తక్కువ ఖర్చుతో సమకూర్చుకొని నూతన ప్రయోగాలతో యువ రైతన్న ముందుకు సాగుతున్న తీరు అదిరింది. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన పెండేప్ కృష్ణ మూర్తి తక్కువ కూలీలతో తనకున్న ఐదెకరాల్లో సరికొత్త ప్రయోగాలతో దుక్కిలు దున్నే యంత్రం, పంటకు మందు చల్లే యంత్రం అలాగే సీడ్ డ్రమ్ యంత్రం తయారు చేసి చుట్టు పక్కల జనాలతో ఔరా అని అనిపించుకుంటున్నాడు. ఆరోగ్య ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఇది ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మొదట జూన్ మాసంలో ఇదే పల్సర్ బైక్‌ను ఉపయోగించి రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెప్పించుకున్న మిషన్‌తో పంటలో కలుపు తీయగా.. ఇప్పుడు ఇదే పల్సర్ బైక్‌కు ఒక డ్రమ్‌లో మందు నింపి, మిషన్‌తో ఇలా పిచికారిచేయడం అందరినీ ఆకర్షిస్తోంది.