నిర్మల్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఖానాపూర్, కడెం మండలాల్లో శుక్రవారం భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. కడెం మండలం అల్లంపెళ్లి పంచాయతీ పరిధిలోని పాలరేగడి, బాబానాయక్ తండా గ్రామాల్లో నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ శశిధర్ రాజు వెల్లడించారు. గిరిజనులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నట్లు సమాచారం రావడంతో కడెం పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. పోలీసు, వ్యవసాయ […]

Update: 2020-06-05 05:53 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఖానాపూర్, కడెం మండలాల్లో శుక్రవారం భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. కడెం మండలం అల్లంపెళ్లి పంచాయతీ పరిధిలోని పాలరేగడి, బాబానాయక్ తండా గ్రామాల్లో నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ శశిధర్ రాజు వెల్లడించారు. గిరిజనులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నట్లు సమాచారం రావడంతో కడెం పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. పోలీసు, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News