ఖమ్మం మార్కెట్లో వ్యాపారుల దోపిడీ

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : దూది రైతుకు దుఃఖ‌మే మిగులుతోంది. మార్కెట్‌లో వ్యాపారుల మీద ముంద రైతు క‌ష్టం తేలిపోతోంది. కాస్తయినా లాభంతో ఇంటికి చేరుకోవాల‌ని ఆశ‌ప‌డ్డ రైతుల‌కు వ్యాపారులు చెబుతున్న రేటు క‌ళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తోంది. అస‌లే దిగుబ‌డి రాక వ‌చ్చిన కాస్త ప‌త్తిపై కొండంత ఆశ  పెట్టుకుని మార్కెట్లో అడుగుపెడుతున్న రైతు.. అవ‌గింజ‌త‌యినా సంతోషం లేకుండానే గుండె నిండా బాధ‌తో ఇంటిముఖం ప‌డుతున్నాడు. వ‌రుస వ‌ర్షాలు ప‌త్తిరైతును నిండా ముంచేస్తే.. వ‌చ్చిన కొద్దోగొప్పో […]

Update: 2020-11-04 01:23 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : దూది రైతుకు దుఃఖ‌మే మిగులుతోంది. మార్కెట్‌లో వ్యాపారుల మీద ముంద రైతు క‌ష్టం తేలిపోతోంది. కాస్తయినా లాభంతో ఇంటికి చేరుకోవాల‌ని ఆశ‌ప‌డ్డ రైతుల‌కు వ్యాపారులు చెబుతున్న రేటు క‌ళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తోంది. అస‌లే దిగుబ‌డి రాక వ‌చ్చిన కాస్త ప‌త్తిపై కొండంత ఆశ పెట్టుకుని మార్కెట్లో అడుగుపెడుతున్న రైతు.. అవ‌గింజ‌త‌యినా సంతోషం లేకుండానే గుండె నిండా బాధ‌తో ఇంటిముఖం ప‌డుతున్నాడు. వ‌రుస వ‌ర్షాలు ప‌త్తిరైతును నిండా ముంచేస్తే.. వ‌చ్చిన కొద్దోగొప్పో ప‌త్తిని మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతుల‌ను వ్యాపారులు దోచేస్తున్నారు. ఖ‌మ్మం మార్కెట్లో ప‌త్తి రైతులు ద‌గాకు గుర‌వుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప‌త్తికి 2020-21 సంవ‌త్సరంలో క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను క్వింటాకు రూ. 5515గా నిర్ణయించింది. అయితే ఖ‌మ్మం మార్కెట్లో ఎక్కడా ఈ రేటు నిర్ణయం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

క‌నీస మ‌ద్దతు ధ‌ర ప‌ల‌కకుండా మేలు ప‌త్తిని కూడా క్వింటాకు రూ.4000 మించ‌కుండా కొనుగోళ్లు చేప‌ డుతున్నారు. జెండాపాట‌గా మొత్తం కొనుగోళ్లలో 5శాతం ప‌త్తికి మాత్రంమే రూ. 4300 నుంచి 4600 లోపు నిర్ణ‌యిస్తున్నారు. కేవ‌లం 5శాతం ప‌త్తికి మాత్ర మే కాస్తంత ఓ తీరుగా ధ‌ర‌ను నిర్ణయిస్తున్న ఖ‌రీద్దారులు.. మిగ‌తా ప‌త్తిని వివిధ ర‌కాల కొర్రీలు చూపు తూ నాసిర‌కం స‌రుకుగా పేర్కొంటూ త‌క్కువ ధ‌ర‌కే తీసుకెళ్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస వ‌ర్షాల‌తో నానిపో యి.. న‌ల్లగా మారి.. తేమ‌ శాతం ఎక్కువ‌గా ఉన్న ప‌ త్తికైతే దారుణ‌మైన రేటును నిర్ణయిస్తున్నారు. కొద్దిగా న‌ల్లబారిన ప‌త్తికి కూడా క్వింటాకు రూ.2000 మిం చి ధ‌ర పెట్టడం లేదు. మార్కెట్లో ఇంత య‌థేచ్ఛగా దోపిడీ జ‌రుగుతున్నా అధికారులు ప‌ట్టించుకోకపో వ‌డం గ‌మ‌నార్హం.

కొర్రీలు లేకుండా కొనుగోళ్లు సాగేనా..?

ఖ‌మ్మం మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయ‌క‌పోవ‌డంతో వ్యాపారులు పెట్టిందే రేటుగా మారింది. దిక్కులేని ప‌రిస్థితుల్లో రైతులు వ్యాపారు ల‌కు తెగ‌న‌మ్ముకుని వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రం ఏ ర్పాటు చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం వ‌హిస్తూ వ‌చ్చింది. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రేపు మాపు అంటూ జాప్యం చేస్తూ.. వాయిదాలు వేస్తూ వ‌చ్చిన అధికారులు ఎట్టకేల‌కు ఈనెల‌4న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే రైతులు తీసుకువ‌చ్చిన స‌రుకును కొర్రీలు పెట్టకుండా పార‌ద‌ర్శకంగా కొనుగోళ్లు జ‌రిగేలా చూడాల‌ని అధికారుల‌ను కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప‌త్తి సాగు ఇలా..

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఇల్లందు, పాల్వంచ‌, బూర్గంప‌హాడ్‌, దుమ్ముగూడెం, సుజాత‌న‌గ‌ర్‌, ఏన్కూరు, స‌త్తుప‌ల్లి, కొణిజ‌ర్ల‌, నేల‌కొండ‌ప‌ల్లి, పా లేరు, ఖ‌మ్మం రూర‌ల్‌, అశ్వాపురం మండ‌లాల్లో ప‌త్తిపంట సాగు అధికంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 20,8675 హెక్టార్లలో ప‌త్తిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వ‌రుస వ‌ర్షాల‌తో చాలా వ‌ర‌కు పంట న‌ష్టపోయింది. ఎక‌రానికి 5 క్వింటాళ్ల లోపే దిగుబ‌డి వ‌స్తుంద‌ని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు పెడు తున్న ధ‌ర‌తో పెట్టుబ‌డి కూడా తిరిగి చేతికొచ్చే ప‌రిస్థితి లేద‌ని వాపోతున్నారు.

Tags:    

Similar News