ఈవోఎస్-01 సక్సెస్‌

న్యూఢిల్లీ: దాదాపు ఏడాదికాలం తర్వాత భారత్ శనివారం విజయవంతంగా భూ పరిశీలన ఉపగ్రహాన్ని(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-ఈవోఎస్-01) కక్ష్యలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 3.12 నిమిషాలకు ఇస్రో ఈ మిషన్‌ను విజయవంతంగా చేపట్టింది. 3.02 నిమిషాలకు ప్రయోగించాలని భావించినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా పదినిమిషాలు వాయిదా వేసింది. పీఎస్ఎల్వీ-సీ49 భారత ఉపగ్రహం ఈవోఎస్-01తోపాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. నింగిలోకి దూసుకెళ్లిన దాదాపు 15 నిమిషాల తర్వాత ఈవోఎస్-01ను లో […]

Update: 2020-11-07 07:37 GMT

న్యూఢిల్లీ: దాదాపు ఏడాదికాలం తర్వాత భారత్ శనివారం విజయవంతంగా భూ పరిశీలన ఉపగ్రహాన్ని(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-ఈవోఎస్-01) కక్ష్యలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 3.12 నిమిషాలకు ఇస్రో ఈ మిషన్‌ను విజయవంతంగా చేపట్టింది. 3.02 నిమిషాలకు ప్రయోగించాలని భావించినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా పదినిమిషాలు వాయిదా వేసింది. పీఎస్ఎల్వీ-సీ49 భారత ఉపగ్రహం ఈవోఎస్-01తోపాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. నింగిలోకి దూసుకెళ్లిన దాదాపు 15 నిమిషాల తర్వాత ఈవోఎస్-01ను లో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత మిగిలిన శాటిలైట్లను ప్రవేశపెట్టింది.

ఈవోఎస్-01

భూపరిశీలనకు ఉపకరించే రీశాట్-2బీ, రీశాట్-2బీఆర్1 కోవకు చెందినదే ఈవోఎస్-01. వ్యవసాయం, అటవీ భూములతోపాటు పట్టణ ప్రాంతాలను ప్రతికూల వాతావరణంలోనూ నిరంతరం పర్యవేక్షిస్తుంది. విపత్తు సందర్భాల్లో సహకరిస్తుంది. దీని రాడార్ ఇమేజ్‌లను మిలిటరీ అవసరాలకు ఉపయోగపడతాయి. ఇకపై భూపరిశీలనకు ఉపగ్రహాల అప్లికేషన్ల ఆధారంగా పేర్లు ఉండకపోవచ్చు. అన్ని ఈవోఎస్ సిరీస్‌లుగానే వెలువడవచ్చు.

మరో తొమ్మిది శాటిలైట్లు

ఈవోఎస్-01తోపాటు అమెరికా, లగ్జెంబర్గ్‌కు చెందిన నాలుగేసి ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక ఉపగ్రహాన్ని 51వ పీఎస్ఎల్వీ నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. సాంకేతిక అవసరాలకు లిథువేనియా ఉపగ్రహం, సముద్రజలాలపై నిఘాకు లగ్జెంబర్గ్ శాటిలైట్లు, రిమోట్ సెన్సింగ్ అవసరాలకు అమెరికా ఉపగ్రహాలు పనిచేయనున్నాయి.

లాంచ్‌వెహికిల్‌ కూడా శాటిలైట్‌గా

ఇస్రో శనివారం పీఎస్ఎల్వీ రాకెట్ కొత్త వేరియంట్‌ను ఉపయోగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన తర్వాత లాంచ్ వెహికిల్ కూడా ఒక ఉపగ్రహంగా సేవలందిస్తుంది. చివరి దశలోని రాకెట్ దానికదిగా సొంత కక్ష్యను చేరి అంతరిక్ష ప్రయోగాలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. దీని జీవితం కాలం ఆరునెలలు.

For video Click on below link

https://fb.watch/1Cm0hIRoD_/

Tags:    

Similar News