హుజూరాబాద్‌ ఉపఎన్నిక: స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలు సేఫ్

దిశ, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఈవీఎంలు సోమవారం రాత్రి హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. మొదటి ర్యాండమైజేషన్ తర్వాత తరలించిన ఈవీఎంలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్ర పరిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మంగళవారం విలేఖరులతో చెప్పారు. ఈ నెల 30న జరుగనున్న హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను హుజూరాబాద్‌కు తరలించారు. పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి […]

Update: 2021-10-05 08:59 GMT

దిశ, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఈవీఎంలు సోమవారం రాత్రి హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. మొదటి ర్యాండమైజేషన్ తర్వాత తరలించిన ఈవీఎంలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్ర పరిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మంగళవారం విలేఖరులతో చెప్పారు. ఈ నెల 30న జరుగనున్న హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను హుజూరాబాద్‌కు తరలించారు. పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని రవీందర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News