కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలి : డాక్టర్ మనోహర్
దిశ, దౌల్తాబాద్: జిల్లాలో కరోనా వంద శాతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. గురువారం రాయపోల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో మాట్లాడిన అనంతరం అనాజీ పూర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ హెల్త్ క్యాంపు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31 వరకు కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా […]
దిశ, దౌల్తాబాద్: జిల్లాలో కరోనా వంద శాతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. గురువారం రాయపోల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో మాట్లాడిన అనంతరం అనాజీ పూర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ హెల్త్ క్యాంపు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31 వరకు కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం ఫస్ట్, సెకండ్ డోసు 47 శాతం వేయడం జరిగిందని ఆయన తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ఇందుకోసం ఆయా మండలాల పరిధిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్ క్యాంపులను ఏర్పాటు చేసి వంద శాతం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లతో కమిటీలు వేసి గ్రామాల్లో వ్యాక్సిన్ తీసుకొని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కొవిడ్ కారణంగా హెల్త్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీవో నరసింహారావు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.