సిరిసిల్లకు EVDM రెస్క్యూ టీమ్

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గతవారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కరుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం పూర్తిగా జలమయం అయ్యింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్) రెస్య్కూ టీమ్ సభ్యులను సిరిసిల్ల పట్టణానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 40 మంది సహాయక సిబ్బందితో పాటు […]

Update: 2021-09-07 06:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గతవారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కరుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం పూర్తిగా జలమయం అయ్యింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్) రెస్య్కూ టీమ్ సభ్యులను సిరిసిల్ల పట్టణానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 40 మంది సహాయక సిబ్బందితో పాటు అధునాతన పరికరాలను, బోట్లను పంపించినట్లు ఈవీడీఎమ్ డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వీరంతా ఆ జిల్లా అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News