నా భూమిలో మొక్క నాటితే.. ఆత్మహత్య చేసుకుంటా
దిశ, ములుగు: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని శనివారం గొత్తికోయలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… పదిహేనేండ్ల క్రితం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతల మోరి గొత్తికోయగూడేనికి చత్తీస్‌గఢ్ నుంచి ఇరవై నాలుగు కుటుంబాలు వలస వచ్చి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా చింతలమోరి గ్రామంలో 50 ఎకరాల్లో మొక్కలు నాటడానికి ఫారెస్ట్ అధికారులతో పాటు కూలీలను […]
దిశ, ములుగు: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని శనివారం గొత్తికోయలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… పదిహేనేండ్ల క్రితం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతల మోరి గొత్తికోయగూడేనికి చత్తీస్‌గఢ్ నుంచి ఇరవై నాలుగు కుటుంబాలు వలస వచ్చి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా చింతలమోరి గ్రామంలో 50 ఎకరాల్లో మొక్కలు నాటడానికి ఫారెస్ట్ అధికారులతో పాటు కూలీలను తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. 15 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న భూముల్లో మొక్కలు నాటితే తమ జీవనభృతి పోతుందని చింతలమోరి గ్రామస్తులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన దేవయ్య అనే వ్యక్తి నా భూమిలో మొక్కలు నాటితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డబ్బాతో అధికారుల ముందు హల్‌చల్ చేశాడు. దీంతో అటవీ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.