వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: ఈటల

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ సూచనలే మేరకే వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి తొలి టీకా ప్రారంభం నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. డీసీజీఐ నుంచి అమోదం పొందిన వ్యాక్సిన్‌ను మాత్రమే అందజేస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు అవసరం లేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతోందని.. 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణీలకు మాత్రం […]

Update: 2021-01-15 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ సూచనలే మేరకే వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి తొలి టీకా ప్రారంభం నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. డీసీజీఐ నుంచి అమోదం పొందిన వ్యాక్సిన్‌ను మాత్రమే అందజేస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు అవసరం లేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతోందని.. 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణీలకు మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదన్నారు. తొలి విడత టీకాలో భాగంగా తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News