ఈటల సడెన్ ఢిల్లీ టూర్.. టీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సడెన్‌గా ఢిల్లీ టూర్‌కు వెళ్లడం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.  ఈ రోజు ఉదయం 10 గంటలకు అర్జెంట్‌గా ఈటల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గానికి నిజాంబాద్ ఎంపీ అరవింద్  వస్తున్నారు.  ఈ క్రమంలో సన్నిహితులు, నియోజకవర్గ బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వడం సడెన్‌గా ఈటల ఢిల్లీ టూర్‌కి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో కేంద్ర హోం […]

Update: 2021-06-26 01:04 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సడెన్‌గా ఢిల్లీ టూర్‌కు వెళ్లడం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు అర్జెంట్‌గా ఈటల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గానికి నిజాంబాద్ ఎంపీ అరవింద్ వస్తున్నారు. ఈ క్రమంలో సన్నిహితులు, నియోజకవర్గ బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వడం సడెన్‌గా ఈటల ఢిల్లీ టూర్‌కి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలతో ఈటల భేటీ కానున్నారు.

ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో ఈటల ఢిల్లీ టూర్ వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరో కొద్దినెలల్లో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికకు బీజేపీ అధిష్టానం ఇంచార్జ్‌లను నియమించింది. దీంతో ఈటల ఢిల్లీ పర్యటనలో అమిత్ షా, బీజేపీ పెద్దలతో హుజురాబాద్ ఉపఎన్నికపై చర్చ జరిగే అవకాశముంది.

Tags:    

Similar News