హుజురాబాద్ నుంచి జమునా రెడ్డి పోటీ..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ఈటల ఎపిసోడ్‌కు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్టానం బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, హుజురాబాద్‌లో ఈటలను ఒంటరిని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మరో అంశం తెరమీదకు వచ్చింది. ఈటల రాజేందర్ ఒకవేళ రాజీనామా చేస్తే ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు హుజురాబాద్ నుండి ఆయన […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ఈటల ఎపిసోడ్‌కు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్టానం బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, హుజురాబాద్‌లో ఈటలను ఒంటరిని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మరో అంశం తెరమీదకు వచ్చింది.
ఈటల రాజేందర్ ఒకవేళ రాజీనామా చేస్తే ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు హుజురాబాద్ నుండి ఆయన సతీమణి జమునా రెడ్డి బరిలో నిలవనున్నట్లు సమాచారం. దీనికి ఈటల రాజేందర్ కూడా సుముఖత వ్యక్తం చేయగా, జమునారెడ్డి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో జమున హుజురాబాద్ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.