ఈటల అంతర్గత సంభాషణల ఆడియో లీక్.. వైరల్!
దిశ, కమలాపూర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో, ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియడం లేదు. ఇటీవల ఈటల సోదరుడు ఈటల భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈటల, నాయకుల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత నెల మే 27న శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసంలో కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, యువతతో ఈటల భేటీ అయ్యారు. ఆ […]
దిశ, కమలాపూర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో, ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియడం లేదు. ఇటీవల ఈటల సోదరుడు ఈటల భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈటల, నాయకుల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత నెల మే 27న శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసంలో కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, యువతతో ఈటల భేటీ అయ్యారు. ఆ భేటీలో ఈటల స్థానిక మండలంలోని నాయకుల తీరును, రాజకీయ సమీకరణాలపై చర్చ చేస్తుండగా భేటీలో ఉన్న ఈటల సోదరుడు భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో ఆ భేటీకి సంబంధించిన మాటలను రికార్డు చేసినట్లు సమాచారం.
అందులో మండల నాయకుల సంభాషణ రికార్డు అయ్యింది. అయితే, ఇటీవల ఆ వాయిస్ రికార్డు భద్రయ్య ఫోన్ నుంచి ‘ఈటల అండ’ అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయబడింది. ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి వెంటనే ఫార్వార్డ్ అయినట్లు సమాచారం. వాట్సాప్ గ్రూపులోని ఒక సభ్యుడు స్పందించి ఇది ఏంటిది అన్నా అని ప్రశ్నించగా భద్రయ్య కుమారుడు ఈటల నవనీత్ ఆ వాయిస్ రికార్డింగ్ సందేశం అనుకోకుండా పొరపాటున నొక్కడం వలన వచ్చిందని సమాధానం ఇచ్చారు. అయితే, ఈ వాయిస్ రికార్డు ఈటల తమ్ముడు భద్రయ్య ఎందుకోసం రికార్డ్ చేయవలసి వచ్చింది..? ఎవరికి పంపించడం కోసం దానిని రికార్డ్ చేశారన్న చర్చ హుజురాబాద్ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది.