ఆ డబ్బుతో వైట్‌హౌజ్‌ను 470 సార్లు కొనొచ్చు

దిశ, వెబ్ డెస్క్ : స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈవో ఎలన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అతడు 194.8 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల్లోనే మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బెజోస్ 185 బిలియన్‌ డాలర్ల ధనార్జనతో రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. అయితే ఎలన్ ఆదాయాన్ని బిలియన్ డాలర్లుగా చెబితే.. ఓ అంత డబ్బా! అనుకుంటాం కానీ, ఆ డబ్బుతో ఏమేం చేయొచ్చు ఓసారి క్లుప్తంగా తెలుసుకుందాం. బహమాస్‌లో 2506 […]

Update: 2021-01-09 03:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈవో ఎలన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అతడు 194.8 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల్లోనే మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బెజోస్ 185 బిలియన్‌ డాలర్ల ధనార్జనతో రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. అయితే ఎలన్ ఆదాయాన్ని బిలియన్ డాలర్లుగా చెబితే.. ఓ అంత డబ్బా! అనుకుంటాం కానీ, ఆ డబ్బుతో ఏమేం చేయొచ్చు ఓసారి క్లుప్తంగా తెలుసుకుందాం.

బహమాస్‌లో 2506 దీవులు :

అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహమాస్‌లో 700లకు పైగా దీవులు, పగడపు దిబ్బలు, చిన్న చిన్న ద్వీప ఖండాలున్నాయి. ఇక్కడ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్రైవేట్ ఐలాండ్ ధర 75 మిలియన్ డాలర్లు ఉండగా, ఎలన్ మస్క్.. తన దగ్గరున్న డబ్బుతో బహమాస్‌లో 2506 వరకు ప్రైవేట్ ఐలాండ్స్‌ను కొనుగోలు చేయొచ్చు.

బకింగ్‌హమ్ ప్యాలెస్‌ను 38 టైమ్స్ :

బ్రిటన్ రాజకుటుంబీకులకు చెందిన ‘బకింగ్‌హమ్ ప్యాలెస్’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీల్లో ఒకటి కాగా, దీని ధర 4.9 బిలియన్ పౌండ్స్. ఈ లెక్కన మస్క్ తనదగ్గరున్న మనీతో ఈ బకింగ్‌హమ్ ప్యాలెస్‌ను 38 సార్లు కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. ఆ ప్యాలెస్‌లోని యాంటిక్ ఫర్నిచర్, వరల్డ్ సూపర్ ఆర్ట్‌ వర్స్క్‌తో పాటు లగ్జరీ అమెనిటీస్‌ కూడా ఆయన సొంతమవుతాయి.

470కి పైగా ‘ఎయిర్‌బస్ 747’ విమానాలను కోనుగోలు చేయొచ్చు.

6 బిలియన్ డాలర్ల ఖర్చుతో కూడిన 32 మార్స్ మిషన్ ప్రయోగాలు చేపట్టొచ్చు.

అమెరికా అధ్యక్షుడి వైట్‌హౌజ్‌ను 470సార్లు కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. అంబానీ ‘అంటిల్లా’ ఇంటిని 94సార్లు కొనుక్కోవచ్చు.

18 మిలియన్ డాలర్ల విలువ కలిగిన బుగాటి లా వయోటర్ నోయిర్ కార్లను 10,500 వరకు ఖరీదు చేయొచ్చు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా నిలిచిన సాల్వేటర్ ముండిని 417సార్లు కొనుగోలు చేయొచ్చు. లియోనార్డో డావిన్సీ గీసిన ఈ పెయింటింగ్‌ ధర 450 డాలర్లు.

Tags:    

Similar News