స్వీట్స్ ఇచ్చాడు.. దెబ్బలు తిన్నాడు..

తీసుకున్న స్వీట్స్ కు డబ్బులు అడిగినందుకు ఓ మహిళతో సహా మరికొందరు షాపు యజమాని పై దాడి చేశారు.

Update: 2024-11-25 12:10 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : తీసుకున్న స్వీట్స్ కు డబ్బులు అడిగినందుకు ఓ మహిళతో సహా మరికొందరు షాపు యజమాని పై దాడి చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఓ మహిళ మోచి బజార్ లోని బాలాజీ స్వీట్ హౌస్ కి వెళ్ళింది. 30 కేజీల స్వీట్స్ ఆర్డర్ చేస్తామని చెప్తూ మూడు రోజుల నుండి తరచు శాంపిల్స్ పేరుతో స్వీట్స్ తీసుకువెళుతుందని ఆదివారం కూడా అదే విధంగా చేయడంతో డబ్బులు ఇచ్చి స్వీట్ తీసుకువెళ్లాలని సూచించినట్లు యజమాని తెలిపాడు.

అయితే స్వీట్స్ తీసుకున్న తర్వాత బిల్లు ఇవ్వాలని యజమాని కోరగా ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చూపింది. తనకు డబ్బులు రాలేదని యజమాని నిలదీయగా వెంట వచ్చిన యువకుడితో కలిసి దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సోమవారం ఈ దాడి పై బాధితుడు జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News