అంగన్వాడి కేంద్రాలకు నిధులు మంజూరు..
మంథని నియోజకవర్గంలోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాలకు సంబంధించిన 9 అంగన్వాడీ కేంద్రాలకు రూ. కోటి 8 లక్షలు నిధులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంజూరు చేయించారు.
దిశ, మంథని : మంథని నియోజకవర్గంలోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాలకు సంబంధించిన 9 అంగన్వాడీ కేంద్రాలకు రూ. కోటి 8 లక్షలు నిధులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భవనాలను మంజూరు చేశారు. మంథని మండలం బట్టుపల్లి, గుంజపడుగు-2, సూరయ్య పల్లి-1, ముత్తారం మండలం హరిపురం, లక్కారం, రామగిరి మండలం సుందిళ్ల-1, నాగేపల్లి- 3, కమాన్ పూర్ మండలం ములకలపల్లి, గుండారం -2, గ్రామాలకు మంజూరైన ప్రతి అంగన్వాడి కేంద్రానికి రూ.12 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ 15 ఫైనాన్స్, ఇతర నిధుల నుండి పెద్దపల్లి కలెక్టర్ 9 అంగన్వాడీలకు కలిపి కోటి 8 లక్షలను మంజూరు చేశారు. ఆయా మండలాల్లో మంజూరైన గ్రామాలు అంగన్వాడి కేంద్రాల భవనాలకు సంబంధించిన గ్రామాలలోని ప్రజలు, అంగన్వాడీలు మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.