సీఎం సహాయనిధికి రూ.11.40 కోట్ల విరాళం
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పిడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒక రోజు వేతనం రూ.11.40 కోట్లను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. సంబంధించిన చెక్కును ఆయా సంస్థల సీఎండీలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పిడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒక రోజు వేతనం రూ.11.40 కోట్లను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. సంబంధించిన చెక్కును ఆయా సంస్థల సీఎండీలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజీ, రత్నాకర్ రావు, అంజయ్య, బిసి రెడ్డి, సాయిబాబా, ప్రకాశ్, జాన్సన్, రమేశ్, వజీర్, కుమారస్వామి, సాయిలు, గణేష్, సతన్యనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్లు కష్టపడి 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్న సీఎం ఉద్యోగులను అభినందించారు.
Tags: Corona, KCR, Pragathi bhavan, Zenco,Transco, NPDCL,SPDCL, cm relief fund