Big Alert: UGC NET పరీక్ష తేదీల్లో మార్పు..రీషెడ్యూల్ ఇదే!

యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పు జరిగింది. ఈ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ సోమవారం సాయంత్రం ప్రకటించారు.

Update: 2024-04-29 13:12 GMT
Big Alert: UGC NET పరీక్ష తేదీల్లో మార్పు..రీషెడ్యూల్ ఇదే!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పు జరిగింది. ఈ పరీక్షను జూన్ 18కు రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ సోమవారం సాయంత్రం ప్రకటించారు. దేశంలోని యూనివర్సటీల్లో లెక్చరర్‌షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జూనియర్ రిసెర్చ్ ఫీలోషిప్, పీహెచ్ఎల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మొదటగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా జూన్ 16వ తేదీన జరగాల్సి ఉంది.

కానీ అదే రోజు సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకొని యూజీసీ నెట్ పరీక్షను జూన్ 18 (మంగళవారం) నిర్వహించాలని ఎన్టీఏ, యూజీసీ నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఎన్టీఏ (NTA) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు గాను పరీక్ష అన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ సందర్శించండి.

Similar News