విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణ ఓపెన్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Update: 2025-04-14 08:03 GMT
విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఓపెన్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించింది. ఈ నెల(ఏప్రిల్) 20 తేదీ నుంచి 26 వరకు ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే ఈ పరీక్షలను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(TOSS) తెలిపింది. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్న సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ ఈ నెల(ఏప్రిల్) 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల వివరాలు..

ఏప్రిల్ 20, 2025= ఉదయం సెషన్ తెలుగు (305), హిందీ (306), ఉర్దూ (301). మధ్యాహ్నం సెషన్ అరబిక్ (310)

ఏప్రిల్ 21, 2025=ఉదయం ఇంగ్లీష్ (302), మధ్యాహ్నం సోషియాలజీ (331).

ఏప్రిల్ 22, 2025=ఉదయం రాజకీయ శాస్త్రం (317). మధ్యాహ్నం సెషన్ కెమిస్ట్రీ (313), పెయింటింగ్ (332)

ఏప్రిల్ 23, 2025= ఉదయం వాణిజ్య వ్యాపార అధ్యయనాలు(319). మధ్యాహ్నం భౌతిక శాస్త్రం (312), మనస్తత్వ శాస్త్రం (328)

ఏప్రిల్ 24, 2025= ఉదయం చరిత్ర (315). మధ్యాహ్న సెషన్ గణితం (311), భౌగోళిక శాస్త్రం (316)

ఏప్రిల్ 25, 2025= మార్నింగ్ ఆర్థిక శాస్త్రం(318), మాస్ కమ్యూనికేషన్(335). మధ్యాహ్నం బయాలజీ (314), అకౌంటెన్సీ (320), హోమ్ సైన్స్ (321)

ఏప్రిల్ 26, 2025=అన్ని వృత్తి పరమైన అంశాలు: సిద్ధాంతం

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా:

*తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org ని సందర్శించండి.

*హోమ్‌పేజీలోని వార్తలు మరియు మీడియా విభాగానికి వెళ్లండి.

*తరగతిని బట్టి " TOSS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్.. TOSS ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2025 " లేదా " TOSS SSC టైమ్ టేబుల్ 2025 " కోసం సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి .

*కొత్త ట్యాబ్‌లో తెరుచుకునే PDFని డౌన్‌లోడ్ చేసుకోండి.

*భవిష్యత్తు సూచన కోసం PDF ని సేవ్ చేయండి.

Tags:    

Similar News