UGC NET-2025 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC నెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2025-04-17 03:57 GMT
UGC NET-2025 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC నెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో నిన్నటి(ఏప్రిల్ 16) నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC NET-2025) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 7వ తేదీలోగా అప్లికేషన్ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాడానికి, పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in ని సందర్శించండి. UGC NET జూన్ 2025 కోసం ముఖ్యమైన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16 ఏప్రిల్ 2025

దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ: 07 మే 2025

దరఖాస్తు ఫారమ్ కోసం ఎడిట్ ఆప్షన్: 09 & 10 మే 2025

అడ్మిట్ కార్డ్ విడుదల: జూన్ మొదటి వారంలో ఉండవచ్చు.

పరీక్ష తేదీలు: జూన్ 21 నుంచి 30 వరకు

ఆన్సర్ కీ విడుదల: జూన్ 2025 నాలుగో వారంలో ఉండవచ్చు.

ఫలితాల ప్రకటన: జూలై 2025లో ఉండవచ్చు.

Tags:    

Similar News