భారీ జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణావకాశం

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)- ఢిల్లీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం స్పెషలిస్ట్ గ్రేడ్-2(సీనియర్) 155, స్పెషలిస్ట్ గ్రేడ్-2(జూనియర్) 403 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే నెల(మే) 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, SC/ST/PwBD/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఉంది. సంబంధిత విభాగంలో MS/MD/MCH/DM/MSC చేసిన వారు అర్హులుగా ప్రకటించారు. మే-25-2025 నాటికి 45 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం సీనియర్ స్కేల్‌కు నెలకు రూ.78,800, జూనియర్ స్కేల్‌కు రూ.67,700 ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.gov.in/ సందర్శించండి.