నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
రైల్వే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గొప్ప అవకాశం.
దిశ,వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గొప్ప అవకాశం. రేల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు RRB ప్రకటించింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ OBC లకు రూ.500, మిగతా వారికి రూ.250గా ఉంది. ఈ పోస్టుల అప్లికేషన్‌కు వచ్చే నెల(మే) 11 చివరితేదీగా ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను https://indianrailways.gov.in/ సందర్శించండి.